అమెజాన్‌‌‌‌‌‌లో గిరిజనుల  ప్రొడక్ట్‌‌లు

అమెజాన్‌‌‌‌‌‌లో గిరిజనుల  ప్రొడక్ట్‌‌లు

న్యూఢిల్లీ: గిరిజన ప్రాంతాల్లో దొరికే చేతితో చేసిన ప్రొడక్ట్‌‌లను తమ ప్లాట్‌‌ఫామ్‌‌లో అమ్మేందుకు ట్రైబ్స్‌‌ ఇండియాతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకున్నామని అమెజాన్ ప్రకటించింది. ఇందుకోసం  కారిగార్‌‌‌‌ మేళాను లాంచ్ చేశామని, యాప్‌‌లో ఒక పేజీ మొత్తాన్ని  లోకల్‌‌గా దొరికే, గిరిజనులు చేతితో చేసిన ప్రొడక్ట్‌‌లను అమ్మకానికి ఉంచుతామని తెలిపింది. కారిగార్ మేళాలో బిద్రి, ధోక్రా, ఇక్కత్‌‌, పట్టచిత్ర వంటి ఫేమస్‌‌ ప్రొడక్ట్‌‌లను అమ్మకానికి ఉంచుతారు. అమెజాన్‌‌లో అమ్మేందుకు సెల్లర్లు చెల్లించే ఫీజు (ఎస్‌‌ఓఏ) ని అగస్ట్‌‌ 30– సెప్టెంబర్‌‌‌‌ 12 మధ్య కారిగార్ మేళ సెల్లర్ల నుంచి వసూలు చేయమని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. కారిగార్ మేళా వంటివి తీసుకురావడం వలన ప్రధాని పిలుపిచ్చిన ‘వోకల్‌‌ ఫర్‌‌‌‌ లోకల్‌‌’ ను ప్రజల్లో మరింతగా తీసుకెళ్లడానికి వీలుంటుందని ట్రైబల్ అఫైర్స్‌‌ మినిస్టర్ అర్జున్‌‌ ముండా అన్నారు.