అమెజాన్‌లో 20 వేల జాబ్స్

అమెజాన్‌లో 20 వేల జాబ్స్
  • అర్హత ఇంటర్మీడియెట్

ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీ అమెజాన్ 20 వేల టెంపరరీ జాబ్స్ ఇవ్వనుంది. వీరందరినీ కస్టమర్ కేర్ సర్వీసుల్లో నియమించనుంది. కస్టమర్లు మరింత సాఫీగా షాపింగ్ చేసుకునేందుకు వీరు సహాయపడతారని తెలియజేసింది. హైదరాబాద్, పుణే, కోయం బత్తూరు, నోయిడా, కోల్‌కతా, జైపూర్, చండీగఢ్, మంగళూరు, ఇండోర్, భోపాల్, లక్నోలో ఈ జాబ్స్ ఉన్నాయి. రాబోయే ఆరు నెలల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కు మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలు రావడంతోఅమెజాన్ భారీగా టెంపరరీ జాబ్స్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కొత్త ఉద్యోగులు ఈ–మెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ ద్వారా కస్టమర్లకు సాయపడాలి. అప్లై చేసే వాళ్లు కనీసం ఇంటర్ చదివి ఉండాలి. ఇంగ్లిష్ , హిందీ, తమిళం, తెలుగు లేదా కన్నడ భాష మాట్లాడగలగాలి. క్యాండిడేట్ పెర్ఫార్మెన్స్,కంపెనీ అవసరాలను బట్టి అతడు/ ఆమెను పర్మనెంట్ చేసే అవకాశాలూ ఉంటాయి. రాబోయే ఆరు నెలల్లో పండగలు, సెలవులు వస్తున్నాయి కాబట్టి షాపింగ్ పెరుగుతుందని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (కస్టమర్ కేర్) అక్షయ్ ప్రభు అన్నారు. ప్రస్తుత ఆపద సమయంలో నిరుద్యోగులకు ఈజాబ్స్ తో ఎంతోమేలు జరుగుతుందని చెప్పారు. టెక్నాలజీ,ఇన్ ఫ్రాస్ట్రక్చర్,లాజిస్టిక్స్ లో 2025నాటికి పది లక్షల జాబ్స్ ఇస్తామని అమెజాన్ ఇది వరకే ప్రకటించింది. గత ఏడేళ్లలో ఏడు లక్షల జాబ్స్ ఇచ్చామని తెలియజేసింది.