ఐపీఎల్ మీడియా రైట్స్ రేసులో జియో, అమెజాన్!

ఐపీఎల్ మీడియా రైట్స్ రేసులో జియో, అమెజాన్!
  • రైట్స్‌‌‌‌  రూ. 50 వేల కోట్లు పలికే చాన్స్‌‌‌‌

ముంబై: ఐపీఎల్ మీడియా రైట్స్‌‌‌‌తో మరోసారి భారీ మొత్తం రాబట్టేందుకు  బీసీసీఐ సిద్ధమైంది.2023-–2027 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించిన బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌‌‌‌ అమ్మకం ద్వారా  కనీసం 50 వేల కోట్లు ఖాతాలో వేసుకోవాలని బోర్డు టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 2018లో ప్రారంభమైన స్టార్ ఇండియా నెట్‌‌‌‌వర్క్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితో ముగిసిపోయింది. ఇందుకుగానూ బీసీసీఐ రూ.16,348  కోట్ల ఆదాయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఐదేళ్ల కోసం బీసీసీఐ బిడ్డింగ్స్‌‌‌‌ను ఆహ్వానించింది. స్టార్ నెట్‌‌‌‌వర్క్, సోనీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌తో పాటు జియో, అమెజాన్ కూడా ఈ బిడ్డింగ్ ప్రాసెస్‌‌‌‌లో పాల్గొననున్నాయి. ఇప్పటికే జియో చానల్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌లను టెలికాస్ట్ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను రిలయన్స్‌‌‌‌ కంపెనీ దాఖలు చేసింది. దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం..

ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​కు చాన్స్‌‌‌‌

రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే దేశభక్తి

కేంద్రం మెట్టు దిగినా ప్రాజెక్టు పట్టాలెక్కడం కష్టమే