అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  •      మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యంలో సామాజిక న్యాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ నెల 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆదివారం ట్యాంక్ బండ్, ఐమాక్స్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి ఏర్పాట్లను  కమిటీ నేతలతో మంత్రి లక్ష్మణ్ పరిశీలించారు. 

రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి అంబేద్కర్ వాదులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు,ఉద్యోగులు యువత పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు చెప్పారు. తగిన ఏర్పాట్లు చేయాలని ట్రాఫిక్, ఎస్సీ సంక్షేమ శాఖ, జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏ అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.