
- గోరటి వెంకన్న, ప్రేమ్ రావత్‌కు డాక్టరేట్లు: వీసీ చక్రపాణి
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్క ర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ కాన్పొకేషన్ను ఈ నెల 30న నిర్వహించనున్నట్టు వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా ఇగ్నో వర్సిటీ వీసీ ఉమా కాంజీలాల్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరవుతారని తెలిపారు. గురువారం వర్సిటీ క్యాంపస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాన్వొకేషన్లో ప్రముఖ కవి గోరటి వెంకన్న, ప్రముఖ విద్యావేత్త ప్రేమ్ రావత్ కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానం చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా 60,288 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వీరిలో మొత్తం 86 గోల్డ్ మెడల్స్ అందుకోబోతున్నారని తెలిపారు. అందులో డిగ్రీలో 35 మంది, పీజీలో 51 మంది ఉన్నారని వివరించారు.