
- అమెరికాలో అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం
- 14 న ఆవిష్కరణ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా నామకరణం
వాషింగ్టన్: అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం ఓపెనింగ్‌కు రెడీ అయింది. మేరీల్యాండ్‌లోని అకోకీక్లో 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఏర్పాటైంది. ఇందులో ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో 19 అడుగుల విగ్రహాన్ని నిర్మించారు. దీనిని ఈ నెల 14న ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గుజరాత్లో సర్దార్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విగ్రహాన్ని నిర్మించిన రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మనదేశం వెలుపల నిర్మించిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఇదే కావడం విశేషం.