పుతిన్​ను చంపేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే

పుతిన్​ను చంపేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందే
  • రష్యన్లకు అమెరికా సెనేటర్​ పిలుపు

వాషింగ్టన్: ఉక్రెయిన్​పై దాడులకు తెగబడుతున్న పుతిన్​ను చంపాలని అమెరికా సీనియర్​ సెనేటర్ ​లిండ్సే గ్రాహమ్ రష్యా పౌరులకు పిలుపునిచ్చారు. ఉద్రిక్తత ముగిసేలా లేదు.. పుతిన్​ను అంతం చేసేందుకు ఎవరో ఒకరు ముందుకు రావాల్సిందేనంటూ గురువారం ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్​ చేశారు. ఇంటర్వ్యూ తర్వాత కూడా వరుస ట్వీట్లలో స్పందించారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితిని సరిదిద్దగల వ్యక్తులు రష్యా ప్రజలు మాత్రమే అన్నారు. రోమన్​చక్రవరి జూలియస్​ను చంపిన వాళ్లలో ఒకరైన బ్రూటస్​ను గుర్తు చేస్తూ..‘రష్యాలో బ్రూటస్ ఉన్నాడా?’ అంటూ ప్రశ్నించారు. 1944లో హిట్లర్‌‌ను చంపేందుకు ప్రయత్నించి విఫలమైన జర్మన్ అధికారిని ఉటంకిస్తూ.. రష్యా సైన్యంలో ‘కల్నల్ స్టాఫెన్‌‌బర్గ్’ ఉన్నారా లేరా అన్నారు. పుతిన్​ను చంపడం ద్వారా మీరు మీ దేశానికి, తద్వారా ప్రపంచానికి గొప్ప సేవ చేసినవారవుతారంటూ పిలుపునిచ్చారు.