మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ సింగర్

మోదీ కాళ్లు మొక్కిన అమెరికన్ సింగర్

ప్రపంచ సింగర్​ భారత జాతీయ గీతం ఆలపించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. వాషింగ్టన్ లో జూన్​ 23 న ప్రధాని పర్యటన జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్​ రీగన్​ బిల్డింగ్​లో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో  ప్రవాస భారతీయులు, ప్రధాని మోదీతో కలిపి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా 'జన గన మన' జాతీయ గీతాన్ని ఆలపించడానికి  అమెరికా టాప్ సింగర్​ మేరీ మిల్​బెన్ వచ్చారు. కొందరు ఆమె జాతీయ గీతాన్ని పాడుతారా అని ఆశ్చర్యపోతూ ఉండగా..  మరికొందరు బాగా పాడుతుందా అని సందేహపడ్డారు.

ప్రధానికి పాదాభివందనం..

ప్రధాని సమక్షంలో మోదీ సమక్షంలో ఆమె గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. సభకు హాజరైన జనం గొంతు కలిపారు. అక్కడ ఉన్నవారంతా ఆమె జనగనమన పాడుతుంటే ఆమె స్వరాన్ని వింటూ దేశభక్తితో ఉప్పొంగిపోయారు. పాట పాడటం అయిపోయాక సింగర్ స్టేజీపైనే ప్రధాని మోదీ కాళ్లకు పాదాభివందనం చేయడం అందర్ని ఆశ్చర్యపరిచింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనతో గొంతు కలిపి పాడినందుకు సభికులకు ధన్యవాదాలు తెలిపారు. జనం గొంతుల్లో ఉన్న దేశాభిమానాన్ని తాను చూసినట్లు పేర్కొన్నారు. భారత జాతీయ గీతం ఆలపించడం సంతోషంగా ఉందని ఆ రోజు తాను ఎప్పటికీ మరిచి పోలేని రోజని ఆమె ట్విటర్​లో వెల్లడించారు.