‘కమల’ చుట్టూ.. అమెరికా రాజకీయాలు

‘కమల’ చుట్టూ.. అమెరికా రాజకీయాలు

ఇండియన్ అమెరికన్లలో వేర్వేరు అభిప్రాయాలు

ఆమె రాకతోనే పార్టీకి పెరిగిన దాతలు.. ఎక్కువైన విరాళాలు

డొనాల్డ్ట్రంప్కు సరైన జవాబివ్వగలదని ధీమా

ఇండియాకు వ్యతిరేకమని అక్కడి మనోళ్ల ఆరోపణలు

వాషింగ్టన్ : కమలా హ్యారిస్… ఆ పేరు ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో ఓ సంచలనమైంది. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఆమెను ప్రెసిడెంట్ క్యాండిడేట్ జో బిడెన్ ప్రకటించినప్పటి నుంచి రాజకీయాలు ఆమె చుట్టూ తిరుగుతున్నాయి. కారణం ఆమె ఇండియా సంతతికి చెందినామె కావడం, చరిత్రలో తొలిసారిగా వైస్ ప్రెసిడెంట్ రేసులో నిలిచిన నల్ల జాతీయురాలు కావడమే!! కొందరు ఇండియన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు ఆమెను వ్యతిరేకిస్తున్నారు. డెమొక్రాట్లకు కొత్త శక్తినిచ్చారని కొందరంటే.. ఆమెతో ఒరిగేదేం లేదని ఇంకొందరు అంటున్నారు. హక్కులపై కొట్లాడే గొంతు ఆమెది అని కొందరంటే.. చాలామంది హక్కులను కాలరాసిన తత్వమని మరి కొందరు విమర్శిస్తున్నారు. ఏదైనా ఆమె చుట్టూనే తిరుగుతున్న అమెరికా రాజకీయాల్లో ఆమెపై ఇండియన్ల నుంచే మిక్స్ డ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

పార్టీకి దాతలు పెరిగారు

కమలా హ్యారిస్ డెమొక్రాట్లకు కొత్త శక్తినిచ్చారని అంటున్నారు నిపుణులు. చాలా మంది ఇండియన్ల మద్దతు ఆమెకు ఉండడం, లాయర్ గా తన మాటల్లోని పదును.. ట్రంప్ ను ఎదుర్కొనేందుకు అస్త్రాలుగా పనికొస్తాయంటున్నారు. అందుకే ఇప్పుడు కమలా చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయన్నది నిపుణుల మాట. అంతేకాదు, ఆ మాటలకు మరింత బలాన్నిచ్చేలా ఆమె పేరును ప్రకటించాక డెమొక్రటిక్ పార్టీకి ఫండ్స్ భారీగా పెరిగాయి. దాతలూ పెరిగారు. కొత్తగా లక్షన్నర మంది దాతల జాబితాలో చేరారు.

దీంతో 3.6 కోట్ల డాలర్ల విరాళాలొచ్చాయి.

ఫ్లాయిడ్ ఘటనపైనా గొంతెత్తారు

మెడపై మోకాలితో నొక్కి జార్జ్​ ఫ్లాయిడ్ మృతికి కారణమైన పోలీసుల చర్యపై ఎంతలా ఉద్యమం రగిలిందో చెప్పనక్కర్లే దు. ఆ ఉద్యమంలో కమల కూడా తన గొంతెత్తారు. నల్లజా తీయుల హక్కులపై మాట్లాడారు. కమలా హ్యారిస్ స్వతహాగా తాను ప్రోగ్రెసివ్ అని చెప్పుకుంటారు. అవసరం అనుకుంటే ఎవరినైనా, దేనిమీదనైనా ఎదిరించి మాట్లాడేందుకు సిద్ధంగా ఉంటారు. ట్రంప్ మీదనే కాదు.. జో బిడెన్ పైనా ఆమె గొం తెత్తిన రోజులున్నాయి.

ఇండియన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడరా?

కమలను ఎంపిక చేయడంపై పాజిటివ్ లతోపాటే నెగెటివ్ లూ ఉన్నాయి. చాలా మంది ఇండియన్లు ఆమె ఎంపికను ప్రశ్నిస్తున్నారు. అసలు ఇండియన్ అని చెప్పుకోవడానికే కమల ఇష్టపడరని ఆరోపిస్తున్నారు. కమల రాజకీయ నిర్ణయాలెప్పుడూ ఇండియాకు వ్యతిరేకంగానే ఉంటున్నాయని చాలామంది ఇండియన్లు ఆరోపిస్తున్నారు. హ్యారిస్ ను ఎన్నుకోవడం మంచిదే అయినా.. ఆమె రాజకీయ నిర్ణయాల పరంగా హ్యాపీగా లేమంటున్నారు.

హెచ్1బీ వీసా సిస్టంలో రిఫామ్స్ తెస్తాం: బిడెన్

మెరికా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో డెమొక్రటిక్ క్యాండిడేట్ జో బిడెన్ ఇండియన్ అమెరికన్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యే క పాలసీ డాక్యుమెంట్ ను ప్రకటించారు. మన ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇండియన్ అమెరికన్లను ఆకట్టుకునేలా అనేక హామీలు ఇచ్చారు. ప్రధానంగా హెచ్1బీ వీసా సిస్టమ్ లో రిఫా మ్స్ తెస్తామని, గ్రీన్ కార్డులకు కంట్రీ కోటా తొలగిస్తామని బిడెన్ వెల్లడించారు. థియరీటికల్, టెక్ నికల్ ఎక్స్ పర్టైజ్ ఉన్న ఫారిన్ వర్కర్లను యూఎస్ కంపెనీలు ఉద్యోగాల్లో కి తీసుకునేందుకు హెచ్1బీ నాన్ ఇమిగ్రెంట్ వీసాలను జారీ చేస్తుంటారు. ఈ వీసాలు ఏటా ఎక్కువగా ఇండియన్లు.

విమర్శలున్నా రీఫార్మ్స్ తెచ్చారు

కొన్ని మంచి నిర్ణయాలను కమల వ్యతిరేకించారని విమర్శకులు అంటూ ఉంటారు. కీలకమైన క్రిమినల్ జస్టిస్ రీఫార్మ్​ మెజర్స్ కు, పోలీస్ బాడీ కెమెరాలకూ ఆమె వ్యతిరేకమని అంటారు. ఎన్నో తప్పుడు తీర్పులకూ ఆమె కారణమయ్యారన్న ఆరోపణలూ ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ సభ్యురాలిగా చట్టాల్లో సంస్కరణలకూ ఆమె కారణమయ్యారని ఆమె మద్దతుదారులు అంటున్నారు. 2010లో సెనేట్ జ్యుడీషి యరీ కమిటీ హియరింగ్స్ సందర్భంగా ట్రంప్​ అధికారులను ఆమె నిలదీసిన తీరును గుర్తుచేస్తున్నారు. ఆమె లాయర్ గా ఎంత రాటుదేలారో ఆ విచారణనే చెబుతుందన్నారు. ఇప్పుడు ఎన్నికల్లో నూ ట్రంప్​కు, డిబేట్ లో మైక్ పెన్స్ కు గట్టి సమాధానాలు చెప్పగలరని భావిస్తున్నారు.