క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు కొత్త మందు.. 9 ఏండ్ల పాప పేరిట ‘ఏవోహెచ్1996’గా పేరు

క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు కొత్త మందు.. 9 ఏండ్ల పాప పేరిట ‘ఏవోహెచ్1996’గా పేరు

వాషింగ్టన్‌‌‌‌: క్యాన్సర్‌‌‌‌‌‌‌‌కు అమెరికా పరిశోధకులు కొత్త మందును అభివృద్ధి చేశారు. దీనికి ఏవోహెచ్‌‌‌‌1996గా పేరు పెట్టారు. ఒక పాపకు నివాళిగా ఈ డ్రగ్‌‌‌‌కు పేరుపెట్టారు. చివరి నంబర్స్‌‌‌‌ ఆ పాప పుట్టిన సంవత్సరానికి గుర్తుగా పెట్టామని పరిశోధకులు వివరించారు. అన్నా ఓలివియా హీలీ (ఏవోహెచ్‌‌‌‌) అనే చిన్నారి 1996లో అమెరికాలోని ఇండియానాలో జన్మించింది. న్యూరోబ్లాస్టోమా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బారిన పడిన ఆ చిన్నారి పొరాడి తన తొమ్మిదవ ఏటా 2005లో మరణించింది. ఆ పాప మరణం పరిశోధకులను తీవ్రంగా కలిచివేసింది. దీంతో ఇకపై ఈ వ్యాధి బారిన పడి ఏ ఒక్క చిన్నారి ప్రాణం పోకూదనే ఉద్దేశంతో ఈ డ్రగ్‌‌‌‌ను అభివృద్ధి చేశారు. కాలిఫోర్నియాలోని హోమ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో ఈ డ్రగ్‌‌‌‌కు క్లినికల్‌‌‌‌ ట్రయల్‌‌‌‌ జరుగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కాగా, న్యూరోబ్లాస్టోమా నాడీ కణాల్లో ప్రారంభమై, పిండంపై ప్రభావం చూపుతుంది. సుదీర్ఘ కాలం పరిశోధనల తర్వాత ఈ డ్రగ్‌‌‌‌ను కనుగొన్నారు.