కుక్కల కోసం లైబ్రరీ!

కుక్కల కోసం లైబ్రరీ!

లైబ్రరీలో బోలెడన్ని పుస్తకాలుంటాయి. అక్కడ పుస్తకాలు చదివేవాళ్లకు నాలెడ్జ్‌‌‌‌తో పాటు, మనసుకు ప్రశాంతత దొరుకుతుంది. కానీ, ఈ లైబ్రరీలో మాత్రం పుస్తకాలు ఉండవు. నాలుగ్గోడల మధ్య ఉండాల్సిన లైబ్రరీ.. పార్క్‌‌‌‌లో ఉంటుంది. పుస్తకాల బదులు ఆడుకునే బొమ్మలుంటాయి. అదేంటి, లైబ్రరీలో పుస్తకాలు ఉండాలి కదా! బొమ్మలేంటి అనుకుంటున్నారా.. ఎందుకంటే ఇది కుక్కల లైబ్రరీ కాబట్టి. యుఎస్‌‌‌‌ఎలోని టెన్నెస్సీకి చెందిన ఒక మహిళకి  ‘డాగ్‌‌‌‌ లైబ్రరీ’ పెట్టాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తన ఇంటి దగ్గర్లో ఉన్న పార్క్‌‌‌‌లో ఈ లైబ్రరీని ఏర్పాటుచేసింది.

‘మనిషి నాలుగ్గోడల మధ్య ఉండలేక బయటకి వెళ్తాడు. రకరకాల పనులు చేసి ఎంజాయ్‌‌‌‌ చేస్తాడు. కానీ, ఇంట్లో పెంచుకునే కుక్కని దగ్గరకు తీసుకొని ముద్దాడినా, ఫ్యామిలీ మెంబర్‌‌‌‌‌‌‌‌లా చూసుకున్నా అది ఆనందంగా ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ప్రతి జీవి స్వేచ్ఛని కోరుకుంటుంది. ఒకే చోట ఉంచితే పంజరంలో ఉన్నాననే ఫీలింగ్‌‌‌‌ వాటికి కూడా వస్తుంది. అందుకే డాగ్‌‌‌‌ లైబ్రరీ స్టార్ట్‌‌‌‌ చేశా. ఈ లైబ్రరీలో కుక్కలకు సంబంధించిన ఆటవస్తువులు ఉంటాయి. ఇక్కడికి ఎవరైనా కుక్కల్ని తీసుకురావచ్చు. ఆడించొచ్చు. వాటికి నచ్చిన బొమ్మ ఏదైనా తీసుకెళ్లొచ్చు. కాకపోతే తీసుకెళ్లే దాని బదులు ఒక బొమ్మని ఇక్కడ వదలాల్సి ఉంటుంది. బొమ్మలతో పాటు ఒక డస్ట్‌‌‌‌ బిన్‌‌‌‌, డిస్పెన్సరీ పూ బ్యాగ్స్‌‌‌‌ కూడా ఉంటాయి’ అని ‘టోబి ది డాగ్‌‌‌‌’ ట్విట్టర్ అకౌంట్‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్‌‌‌‌ మీడియాలో తెగ వైరల్‌‌‌‌ అవుతోంది.