
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నేడో, రేపో.. సెంట్రల్ కేబినెట్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి గత నెల రోజుల నుంచి కసరత్తు కొనసాగుతోంది. అయితే.. కేబినెట్ విస్తరణకు సంబంధించి మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రులతో కీలక భేటీ ఉంటుందని పీఎంఓ నుంచి మంగళవారం ఉదయం ప్రకటన వచ్చింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే.. మీటింగ్ క్యాన్సిల్ అయినట్లు ప్రకటించింది. కొన్ని రోజులుగా వివిధ శాఖలు, మంత్రుల పనితీరుపై మోడీ, అమిత్ షా రివ్యూ చేస్తున్నారు. ఇవాళ మరికొంతమంది మంత్రుల పనితీరును సమీక్ష చేస్తారని బీజేపీ నేతలు చెప్పారు. ప్రధాని మోడీతో జరగాల్సిన భేటీలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నరేంద్రసింగ్ తోమర్‌లు పాల్గొనాల్సి ఉంది. కాగా.. ఇవాళ జరగాల్సిన భేటీ.. రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తోంది.