
మన్సా: కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం ప్రతిపక్షాల నేతలపై ఫైర్అయ్యా రు. ప్రతిపక్షాల కూటమిని ఓల్డ్ బాటిల్లో ఉన్న ఓల్డ్ వైన్అని కామెంట్చేశారు. రూ.12లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన నేతల కూటమిగా ప్రతిపక్ష ఇండియాను షా ఆరోపించారు. గుజరాత్ గాంధీనగర్జిల్లాలో మన్సా పట్టణంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో అమిత్షా మాట్లాడుతూ..2024 లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కొనేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూసివ్ అలయన్స్ (ఇండియా)పేరుతో కూటమిగా కలిశాయన్నారు. యూపీఏ, కాంగ్రెస్, కూటమి నేతలు 12లక్షల కోట్ల అవినీతికి పాల్పడి ప్రస్తుతం పేరు మార్చుకుని మన ముందుకొచ్చారన్నారు.