అమిత్ షా రాష్ట్ర పర్యటన మళ్లీ రద్దు

అమిత్ షా రాష్ట్ర పర్యటన మళ్లీ రద్దు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు రోజుల తెలంగాణ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. ఈ నెల 3, 4 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించాల్సి ఉండగా.. ఆకస్మికంగా టూర్ రద్దు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

షెడ్యూల్ ప్రకారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన పలు అధికారిక, పార్టీ కార్యక్రమాల్లో అమిత్​షా పాల్గొనాల్సి ఉంది. దీనికి సంబంధించి నిర్వాహకులు, ఆఫీసర్లు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ అనూహ్యంగా ఆయన టూర్​రద్దు కావడంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురయ్యాయి. అమిత్ షా పర్యటన రద్దు కావడానికి గల కారణాలపై పార్టీ వర్గాలు ఎలాంటి  స్పష్టత ఇవ్వలేదు.