వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేనని మరోసారి ప్రూవ్ చేశారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. 83 ఏళ్ల వయసులో ఒకేరోజు ఏకంగా 12 షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్స్ లో పాల్గొని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు రెండు స్టిల్ ఫొటో షూట్స్ కూడా పూర్తి చేశారు. నటుడిగా తన వృత్తి విషయంలో ఆయన ఎంత నిబద్ధతగా ఉన్నారనడాని కి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్.
తన సినిమాల అప్ డేట్స్ బ్లాగ్ ద్వారా అభిమానులతో పంచుకునే అమితాబ్.. ఈ విషయాన్ని వెల్లడించారు. "పని అంటే పనే. ఒకే రోజు 12 షార్ట్ ఫిల్మ్స్ షూట్ చేశా. రెండు స్టిల్ షూట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. ఇదిగో ఇప్పుడిలా మీతో కనెక్ట్ అవుతున్నా. మిగతా పనులన్నీ కొనసాగుతుం టాయి.. ఈ ఈ అనుబంధం మాత్రం ఆగకూడదు" అని రాశారు. పని విషయంలో రాజీ పడకూడదని, ప్రతి రోజు కొత్తగా నేర్చుకుంటూ క్రమశిక్షణతో ముందుకు సాగాలని ఆయన తన బ్లాగ్లో రాసుకొ చ్చారు. సుధీర్ఘసినీకెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, స్టార్ డమ్ చూసిన ఆయన.. ఎనిమిది పదుల వయసు లోనూ యంగ్ హీరోలకు పోటీనిచ్చేలా ఇలా రెట్టింపు ఉత్సాహంతో వర్క్ చేస్తుండడం ఎందరికో స్ఫూర్తిదా యకం అని నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
