రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో.. అమెరికన్ పాప్ సింగర్ మృతి

రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో.. అమెరికన్ పాప్ సింగర్ మృతి

బ్రెజిల్‌లోని రియో డి జెనీరో నగర ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి ఢీకొన్న విషయం తెలిసింది.  ఈప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతిచెందిన వారిలో అమెరికాకు చెందిన ప్రముఖ సింగర్, హాస్యనటుడు ఆలివర్ ట్రీ(32) ఉన్నట్లు గుర్తించారు.  మృతదేహాలు గుర్తపట్టలేని స్థితిలో ఉండటంతో మొదట ఆలివర్ ను గుర్తించలేకపోయారు. 

ఆదివారం (జూన్ 14) ఉదయం  రెండు హెలీకాప్టర్లు  డిజెనీరో నగర వెస్ట్ ప్రాంతంలో కూలిపోయాయి. అందులో ఒక హెలికాప్టర్ కార్ డీలర్‌షిప్ పార్కింగ్ స్థలంలో పడిపోవడంతో, అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అర్పేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. 

మృతుల్లో ఆలీవర్ తో పాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ కంటెంట్ క్రియేటర్ గాస్పర్ ప్రిమ్ డియాజ్ కూడా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతిచెందిన ఆరుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.