కేబీసీ సెట్లో అమితాబ్కు గాయం.. తీవ్ర రక్తస్రావం, కుట్లు

కేబీసీ సెట్లో అమితాబ్కు గాయం.. తీవ్ర రక్తస్రావం, కుట్లు

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్  కౌన్ బనేగా కరోడ్ పతి  సెట్స్ లో  గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆదివారం  అమితాబ్  తన బ్లాగులో వెల్లడించారు.     షూటింగ్ సెట్స్ లో  చిన్న ఇనుప ముక్క తన ఎడమ కాలికి  గీసుకుని నరం కట్ అయ్యిందని చెప్పారు.  వెంటనే  సిబ్బంది  ఆస్పత్రికి తరలించారని తెలిపారు . గాయానికి కుట్లు వేశారన్న ఆయన ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తన బ్లాగ్ లో వెల్లడించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నడవొద్దని..  వాకింగ్ లాంటివి చేయొద్దని డాక్టర్లు చెప్పారన్నారు.  ఫాన్య్ ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన సూచించారు.  

అయితే  గాయం కట్టుతోనే కౌన్ బనేగా కరోడ్ పతి షూట్ లో పాల్గొన్నట్లు అమితాబ్ చెప్పారు. ఎడమకాలికి బ్యాండేజ్ తో సెట్స్ లో అటూ ఇటూ నడుస్తున్న ఫోటోలను అమితాబ్ పోస్ట్ చేశారు. అమితాబ్‌ త్వరగా కోలుకోవాలని  ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల బ్లాక్ బస్టర్ మూవీ బ్రహ్మస్త్ర, గుడ్ బై సినిమాల్లో నటించారు.  ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్ కె సినిమాలో కూడా నటిస్తున్నాడు.