
విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్‌లో 18 ఏళ్ల ఆడ సింహం మృతిచెందింది. వృద్ధాప్యం కారణంగా గుండెపోటుతో మృతి చెందినట్లు ఆదివారం (సెప్టెంబర్ 24వ తేదీన) అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు. శనివారం (సెప్టెంబర్ 23వ తేదీన) ఆడ సింహం చనిపోయిందన్నారు. చనిపోయిన సింహం పేరు మహేశ్వరి.
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సమర్పించిన పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం...
వృద్ధాప్యం కారణంగా మయోకార్డియల్ ఇన్ ఫ్రాక్షన్ (గుండెపోటు) కారణమని వైజాగ్ జూ క్యూరేటర్ నందనీ సలారియా తెలిపారు. 2006లో సింహం (మహేశ్వరి) జన్మించింది. 2019లో గుజరాత్‌లోని సక్కర్‌బాగ్ జూపార్క్ నుండి వైజాగ్ జూకి తీసుకువచ్చారు. ఇక అప్పటి నుంచి ఇదే జూలో ఉంటోంది.