హిందూ మహా సముద్రంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒకే రోజులో మూడో సారి భూకంపం సంభవించడం గమనార్హం. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. హిందూ మహాసముద్రంలో గురువారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. అంతకుముందు కూడా.. 6.4 తీవ్రతతో కూడిన మరొక భూకంపం ఆ ప్రాంతాన్ని 10 కిలోమీటర్ల లోతులో కుదిపేసింది. 4.8 తీవ్రతతో మరో భూకంపం ఆ ప్రాంతాన్ని 10 కి.మీ లోతులో తాకింది. ఇలా వరుస భూకంపాలతో హిందూ మహా సముద్రంలో కల్లోలం రేగింది.
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు ప్రకటించారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఈ క్రమంలో.. తీర ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యలో భాగంగా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు.
డిసెంబర్ 26, 2004న ఉదయం 07:58:53 గంటలకు (స్థానిక సమయం) ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలోని ఆషే పశ్చిమ తీరంలో 9.2-9.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. సుమత్రా-అండమాన్ భూకంపం అని పిలువబడే ఈ సముద్ర గర్భ మెగా థ్రస్ట్ భూకంపం.. బర్మా ప్లేట్, ఇండియన్ ప్లేట్ మధ్య చీలిక కారణంగా సంభవించింది.
ఈ భూకంపం వల్ల 30 మీటర్ల (100 అడుగులు) ఎత్తు వరకు అలలు ఎగసిపడి భారీ సునామీ వచ్చింది. ఈ సునామీ వల్ల.. ఆషే (ఇండోనేషియా), శ్రీలంక, తమిళనాడు (భారతదేశం), ఖావో లక్ (థాయిలాండ్) దేశాలలో 2 లక్షల 27 వేల 898 మంది మరణించారు. ఇది చరిత్రలో లక్షల మందిని పొట్టనపెట్టుకున్న సునామీగా మిగిలిపోయింది.
EQ of M: 6.4, On: 27/11/2025 10:26:25 IST, Lat: 2.99 N, Long: 96.23 E, Depth: 10 Km, Location: Indian Ocean.
— National Center for Seismology (@NCS_Earthquake) November 27, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/rE7bqZfsUO
