గండిపేట, వెలుగు: నార్సింగిలో శుక్రవారం పశువుల సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలకు అద్దం పట్టేలా వివిధ జాతుల పశువులను రంగురంగుల అలంకరణలతో ప్రదర్శించగా, స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
సంక్రాంతి తర్వాత రెండో వారంలో ముర్ర జాతికి చెందిన బర్రె ఒక్కటి రూ.3.5 లక్షల ధర పలకగా, ఒకే రైతు 10 బర్రెలను కొనుగోలు చేయడం విశేషం. పశు సంక్రాంతి సందర్భంగా మార్కెట్ కమిటీ యార్డుకు రూ.32,400 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జాతరలో చత్తీస్‌గఢ్, హర్యానా, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, చండీగఢ్ తదితర రాష్ట్రాల నుంచి గేదెలను తీసుకువచ్చారు.
