సింగరేణి ఎన్నికల నిర్వహణకు అక్టోబరు వరకు గడువు ఇచ్చిన హైకోర్టు

సింగరేణి ఎన్నికల నిర్వహణకు అక్టోబరు వరకు గడువు ఇచ్చిన హైకోర్టు

సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల నిర్వహణకు అక్టోబరు వరకు న్యాయస్థానం గడువు ఇచ్చింది. గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు సింగరేణి గడువు కోరింది. జూన్‌లో ప్రారంభించి మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సింగరేణి ఎన్నికల ప్రక్రియకు నాలుగు నెలల సమయం ఇవ్వాలని సింగరేణి హైకోర్టును కోరింది. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టేందుకు అక్టోబరు వరకు హైకోర్టు గడువు ఇచ్చింది. 

గుర్తింపు కార్మిక సంఘం పదవి కాలం పూర్తయి నాలుగేళ్లు గడిచినా అనేక మలుపుల కారణంగా ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సింగరేణి సంస్థ పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం, ఖమ్మం, ఆసిఫాబాద్​, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలతో పాటు భదాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉంది. సింగరేణి సంస్థకు మొత్తం 11డివిజన్లు ఉండగా ప్రస్తుతం 40 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. 2017లో చివ‌రిసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘ‌మైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తొమ్మిది డివిజన్లలో విజయం సాధించి.. గుర్తింపు సంఘంగా ఆవిర్భవించింది.