రంజితమే పాటకు బామ్మ డ్యాన్స్

రంజితమే పాటకు బామ్మ డ్యాన్స్

సంక్రాంతికి విడుదలైన విజ‌య్ వార‌సుడు థియేటర్లలో దుమ్ము రేపుతోంది.  వంశీ పైడిప‌ల్లి దర్శశ‌క‌త్వంలో ర‌ష్మిక మంద‌న నటించిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో  క‌లెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో సాంగ్స్  అదిరిపోయాయి. ముఖ్యంగా రంజిత‌మే సాంగ్ ఫ్యాన్స్ కు ఊపుతెస్తోంది. థియేట‌ర్‌లో సాగ్ చూస్తూ ఓ వృద్ధురాలు  స్టెప్పుల‌తో హోరెత్తించింది.  యువకులతో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది. 

https://twitter.com/Itz_vijay_raj/status/1614902236437676032

రంజిత‌మే సాంగ్‌కు  థియేట‌ర్‌లో బామ్మ  హుషారైన స్టెప్పుల‌తో అల‌రించింది. పాట ప్లే అవుతుండ‌గా  కొందరు యువకులు స్టేజిపైకి ఎక్కి డ్యాన్స్ చేశారు. వారితో సమానంతో ముసలమ్మ కూడా డ్యాన్స్ తో దుమ్మురేపింది. క్రేజీ స్టెప్స్‌తో  హంగామా సృష్టించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.