విహారయాత్రకు వెళ్తే ఊహించని షాక్.. లోయలో పడిపోయిన కారు

విహారయాత్రకు వెళ్తే ఊహించని షాక్.. లోయలో పడిపోయిన కారు

మధ్యప్రదేశ్‌లో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి ఊహించని ప్రమాదం ఎదురైంది. వారు ప్రయాణించిన కారు జలపాతంలోకి దూసుకెళ్లింది. స్థానికుల అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం చూసేందుకు ఓ కుటుంబం కారులో వెళ్లింది. తమ కారును జలపాతం దగ్గరలో పార్క్ చేసింది. అయితే.. హ్యాండ్ బ్రేక్ సరిగా వేయకపోవడంతో ఆ కారు ఒక్కసారిగా కదిలి జలపాతంలో పడిపోయింది. దీంతో జలాపాతం వద్ద ఉన్న పర్యాటకులు ఏం జరుగుతుందో అర్థంకాక షాక్​ కు గురయ్యారు. 

12 ఏళ్ల బాలిక కారు డోర్ తెరిచి ఉండడంతో కారుతో పాటుగా ఆమె కూడా జలపాతంలో పడిపోయింది. ఇది గమనించిన పాప తండ్రి ఆమెను రక్షించేందుకు లోయలోకి దూకేశాడు. ఇదంతా గమనిస్తున్న కొందరూ పర్యాటకులు ఈత కొడుతూ.. వెళ్లి వారిని రక్షించారు. చిన్న చిన్న గాయాలు తగలడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. హ్యాండ్‌ బ్రేక్‌ సరిగా వేయకపోవడంతో వాహనంలో కూర్చున్న చిన్నారి గేర్‌ రాడ్‌ను కదిలించినట్లు తెలుస్తోంది. దీంతో కారు ఒక్కసారిగా జలపాతం వైపుగా దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది.