Viral Video: క్లీనింగ్ రోబోట్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. నెటిజన్ల ఆసక్తిర కామెంట్లు..

Viral Video: క్లీనింగ్ రోబోట్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. నెటిజన్ల ఆసక్తిర కామెంట్లు..

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. తరుచుగా సోషల్ మీడియాలో పోస్టులతో యాక్టివ్ గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే.. వ్యాపారంలో ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ప్రతిపాదించే ఆనంద్ మహీంద్రా.. బాత్ రూం ను ఎంతో చక్కగా శుభ్రం చేస్తూ తన దృష్టిని ఆకర్షించిన రోబోట్ గురించి ఓ వీడియో షేర్ చేశాడు. మొదట ఈ వీడియోను సోమాటిక్ అనే రోబోటిక్ క్లీనింగ్ సర్వీస్ అందించే కంపెనీ యూట్యూబ్ లో షేర్ చేసింది. కంపెనీ నెలవారీ ఫీజుతో సమర్థవంతంగా పనిచేసే రోబోట్ ను కస్టమర్లకు అందిస్తుంది. ఈ వీడియో చూసిన మహీంద్రా .. రోబోట్ పనితీరుకు ఫిదా అయిపోయాడు.

ఈ క్లీనర్ రోబోట్ స్వయంగా ఇంతలా శుభ్రం చేస్తుందా.. అద్భుతం.. ఆటో మేకర్స్ గా మేం మా ఫ్యాక్టరీలో చాలా రకాల రోబోట్ లను ఉపయోగించాం.. కానీ ఈ అప్లికేషన్ చాలా బాగుంది. చాలా ముఖ్యమైనది కూడా.. ఇది మాకు కావాలి అని ఆనంద్ మహీంద్రా రాశాడు.. 

ఆనంద్ మహీంద్రా పోస్ట్ కు 9వేల లైకులు వచ్చాయి. నెటిజన్లు బాగానే స్పందించారు. అయితే నెటిజన్లు స్పందన మిశ్రమంగా ఉంది. కొందరు బాత్ రూం క్లీనింగ్ రోబోట్ టెక్నాలజీ వినియోగాన్ని కొందరు సమర్థిస్తే.. కొందరు విమర్శించారు.. 

ఓ నెటిజన్ స్పందిస్తూ.. సాధారణ వాష్ రూమ్ లకు బదులుగా డ్రైనేజీలు, మురుగు నీటి ప్లాంట్లు,  శుభ్రం చేయడానికి రోబోట్ లను వినియోగిస్తే బాగుంటుంది. కాలువలు, మురుగు నీటిని క్లియర్ చేయడానికి ఈ రోబోటిక్ లు మరిన్ని అవసరమని మేం భావిస్తున్నాం.. అవి ఇప్పటికీ మాన్యువల్ స్కావెంజింగ్ ద్వారా శుభ్రం చేయబడుతున్నాయి. ఇది తీవ్రమైన అరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి .. కాబట్టి రోబోటిక్ సేవలను అత్యవసరంగా ఆటోమేట్ చేయాలని సూచించారు. 

మరో నెటిజన్ స్పందిస్తూ.. జానిటోరియల్ , హౌస్ కీపింగ్ రంగాలల్లో ఆటోమేషన్ ను ప్రవేశ పెట్టడం వల్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత దేశం లాంటి చాలా నిరుద్యోగం ఉన్న దేశంలో ఇవి నిజంగా అవసరమా ? .. ఒక టెక్ ఔత్సాహికుడిగా ఇది మంచిదని చెప్తాను కానీ.. దేశం అభ్యున్నతిని కోరుకుని వాడి ఇది మంచిదని నేను అనుకోవడం లేదని ’’ రాశాడు. 

నెటిజన్లు అభిప్రాయపడ్డట్లుగానే  రోబోటిక్ వంటి అధునాతన టెక్నాలజీని మురుగు నీటిని క్లియర్ చేసేందుకు, కాలువలు శుభ్రం చేసేందుకు వంటి పనులకు వాడితే.. అటు టెక్నాలజీని వాడినట్టుంటుంది.. ఇటు కార్మికుల ఉపాధికి ఢోకా ఉండదు కదా..