తప్పుచేశానని తేలితే ఉరితీయండి : బీహార్ మాజీ ఎంపీ ఆనంద్​ మోహన్​

తప్పుచేశానని తేలితే ఉరితీయండి : బీహార్ మాజీ ఎంపీ ఆనంద్​ మోహన్​

తప్పుచేశానని తేలితే ఉరితీయండి
ఆనంద్  మోహన్ సింగ్  కామెంట్

న్యూఢిల్లీ: ‘నాపై ఎలాంటి ఫిర్యాదు లేకున్నా 15 ఏళ్లకు పైగా జైలులో ఉన్నాను.. నేను తప్పుచేసినట్లు నిర్ధారణ అయితే నన్ను ఉరితీయండి’ అని బీహార్ మాజీ ఎంపీ ఆనంద్​ మోహన్​ అన్నారు. మాజీ ఐఏఎస్  అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వాపోయారు. తాను అమాయకుడినని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా బీహార్​లోని అరారియాలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ దేశం ఎవరి సొత్తూ కాదు. చట్టంపై నాకు గౌరవం ఉంది. రాజ్యాంగం, చట్టాన్ని నమ్ముతాను.

ఈ కేసులో ఎలాంటి ఫిర్యాదు చేయకుండా 15 ఏళ్లకుపైగా నేను జైలుశిక్ష అనుభవించాను. ఇప్పటికీ నేను నేరం చేసినట్లు ప్రభుత్వం భావిస్తే నన్ను ఉరితీయవచ్చు. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆనంద్  మోహన్  వ్యాఖ్యానించారు. కాగా, జి.కృష్ణయ్య హత్య కేసులో ఆనంద్  ఇప్పటికే జైలు శిక్ష అనుభవించారు. బీహార్ ప్రభుత్వం జైలు నిబంధనలను సవరించడంతో గత నెలలో ఆయన రిలీజ్ అయ్యారు. అయితే, ఆనంద్​ మోహన్​ను విడుదల చేయడానికే నితీశ్​ సర్కారు రూల్స్ సవరించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.