నాలాల్లో పడి ఇంకెంత మంది చిన్నారులు సావాలె?

నాలాల్లో పడి ఇంకెంత మంది చిన్నారులు సావాలె?

హైదరాబాద్: భాగ్యనగరంలో మరో బాలుడు నాలాలో పడి ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ శాసన సభాపక్ష నేత రాజా సింగ్ అన్నారు. బోయిన్ పల్లి భవానీ నగర్‌‌లో ఏడేళ్ల ఆనంద్ సాయి నాలాలో పడి చనిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని రాజా సింగ్ ఆరోపించారు. కనీస రక్షణ చర్యలు చేపట్టకుండా ఇళ్ల ముందు దాదాపు 20 అడుగుల లోతైన నాలాల నిర్మాణం ఎలా చేపడతారని విమర్శించారు. 

ఇండ్ల ముందు బారికేడ్లు పెట్టి ఉంటే ఆనంద్ సాయి బతికేవాడన్నారు. పిల్లాడి చావుకు ప్రభుత్వమే కారణమని.. కమీషన్ కక్కుర్తిలో పడి ప్రభుత్వ పెద్దలు ఆనంద్ సాయిని బలి తీసుకున్నారని దుయ్యబట్టారు. ప్రతి సంవత్సంర చాలా మంది పిల్లలు నాలాల్లో పడి చనిపోతున్నారని.. గతేడాది నెరేడ్‌‌మెట్‌‌లో 12 ఏళ్ల సుమేధ కూడా నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిందని గుర్తు చేశారు. అయినా ఈ సర్కార్‌‌కు బుద్ధి రాలేదని.. ట్విట్టర్ మంత్రి ఆ తల్లుల గర్భకోశకు ఏమి జవాబిస్తారని కేటీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు.