
‘మల్లేశం’ మొదలు ఇటీవల వచ్చిన ‘పొట్టేల్’ చిత్రం వరకు నటనకు ప్రాధాన్యత గల పాత్రలతో మెప్పిస్తోంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. తాజాగా ఆమె ఓ కొత్త చిత్రానికి ఎంపికైంది. సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఆమె కీలకపాత్రలో కనిపించబోతోంది. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తేజ్ కెరీర్‌లో ఇది 18వ చిత్రం.
ఇందులో అనన్య ప్రాధాన్యత గల పాత్రను పోషిస్తోందని తెలియజేస్తూ, సోమవారం ఇంట్రో పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా వైడ్‌గా
విడుదల కానుంది.
Welcoming Bundle of Talent @AnanyaNagalla into the world of #SDT18 pic.twitter.com/l26dtDmrbj
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 11, 2024