ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడోరోజు గాలింపుచర్యలు జరుగుతున్నాయి. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట 17వ గేటు వద్దకు ఓ మృతదేహం కొట్టుకువచ్చిందని.…. కచ్చులూరు వద్ద మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఈ మృతదేహలను దేవీపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించినట్లుగా చెప్పారు పోలీసులు. బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ప్రతికూలం ఏర్పడుతోందని చెప్పారు పోలీసులు. సుడిగుండాలు, వరద ఉధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
