పెద్ద జట్రం గ్రామంలోని .. అంగన్​వాడీ సెంటర్​లోకి పాము

పెద్ద జట్రం గ్రామంలోని .. అంగన్​వాడీ సెంటర్​లోకి పాము

మక్తల్, వెలుగు: ఊట్కూర్  మండలం పెద్ద జట్రం గ్రామంలోని అంగన్​వాడీ కేంద్రంలోకి మంగళవారం పాము రావడంతో చిన్నారులు, అంగన్​వాడీ టీచర్  భయాందోళనకు గురయ్యారు. గ్రామంలోని 4వ సెంటర్ లోకి గత కొన్ని రోజులుగా తేళ్లు, పాములు వస్తున్నాయి.

 కిటికీలు తెరుస్తుండగా పాము కనిపించిందని టీచర్  చెన్నమ్మ తెలిపారు. సెంటర్  చుట్టూ పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో పాములు వస్తున్నాయని చెప్పారు.