ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన అమలులో నారాయణపేట జిల్లాకు జాతీయ గుర్తింపు

ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన అమలులో నారాయణపేట జిల్లాకు జాతీయ గుర్తింపు
  •  అవార్డు అందుకున్న నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక

నారాయణపేట, వెలుగు : ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన అమలులోప్రతిభ చూపించినందుకు గాను నారాయణపేట జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్  ప్రియాంక ఈ అవార్డును అందుకున్నారు. 

వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం కనబరిచిన అంకితభావానికి ఈ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ అధికారుల సమన్వయం, టీమ్​ స్పిరిట్​తో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు.