Health Alert : కోపం తగ్గించుకోండి.. ఈ టెంపర్ ఉంటే మాత్రం ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!

Health Alert : కోపం తగ్గించుకోండి.. ఈ టెంపర్ ఉంటే మాత్రం ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..!

అర్జున్, ప్రీతి పెండ్లి చేసుకున్నరు. చూడచక్కని జంట. ఎవరూ వంక పెట్టలేరు. వాళ్లకు వాళ్లే ముసిముసిగా నవ్వుకుంటరు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. పండుగలకు అర్జున్​ ను  విడిచి పుట్టింటికి పోవాలంటే ప్రీతికి మస్తు దుక్కం వస్తుంది. దేవులాడినా మచ్చ దొరకని అందాల జంట వాళ్లది! ఇవన్ని పెండ్లైన కొత్తలో అన్న మాటలు! ఇప్పుడు ఆ చిలుక గోరింకలే అగ్గిపుల్లలు ఇసిరేసుకుంటున్నారు. మాటల కత్తులు దూసుకుంటున్నారు. మాటకు, మాటకు.. ఇద్దరూ స్ప్రింగ్ లే  ! అంతా చల్లారినంక... ఒకసారి ఆలోచిస్తే.. ఇంత చిన్న విషయానికా? మనం కొట్లాడుకుంది! అనిపిస్తుంది. చిన్న చిన్న కోపాలే.. చిలుక గోరింకల్ని చిక్కుల్లో పడేస్తాయి.  టెంపర్' అనేది జీవితాన్ని హైజాక్ చేస్తుంది. 

గట్టిగా అరిచి, తలుపులను..  కిటికీలను  డబెల్ డబెల్ మని కొట్టి చేతిలో ఏది ఉంటే అది విసిరి పగలగొట్టి కోపాన్ని ప్రదర్శించినంత మాత్రాన సమస్య తీరిపోదు. భార్యాభర్తలు టెంపర్​ ను  కరెక్ట్​గా డీల్ చేయకపోతే.. అది స్లోగా బ్రేకప్​నకు  దారి చేస్తుంది.

టెంపర్ కూడా ఒక ఎమోషనే!

భయం, బాధ, సంతోషం, కరుణ, ప్రేమ, ఎగ్జిట్ మెంట్ లాగే టెంపర్ కూడా ఒక నేచురల్ ఎమోషన్. ఇది ఒక్కోసారి ఒక్కో విషయాన్ని తెలియజేస్తుంది. ఒకసారి భావాన్ని బయటికి చెప్తే మరోసారి ఆ స్థితి ఎదుటివాళ్లను భయపెడుతుంది. అప్ సెట్ చేస్తుంది. ద్వేషం పెంచుకునేలా చేస్తుంది. చెప్పాలనుకున్న విషయం మరుగున పడేసి టెంపర్  డామినేట్​ చేస్తుంది. అంటే కోపం అన్నిఎమోషన్స్ ను కప్పేస్తుంది.   అందులో ప్రేమ, సంతోషం కూడా ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నప్పుడు కోపం రావడంలో తప్పు లేదు కానీ, ఆ కోపం చర్యగా (యాక్షన్) మారి ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలిగించినప్పుడే అసలు సమస్య వస్తుంది.

బేసిక్ రీజన్..

ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నా మొదటి అంతా గులాబీ తోటలాగే కనిపిస్తుంది. ఆ ప్యూని ఎంజాయ్ చేస్తారు. కొన్నాళ్ల తర్వాత గులాబీ కింద ముళ్లు ఉన్నాయన్న సంగతి అర్థమవుతుంది. పుప్వుల్ని ఆస్వాదించడం మానేసి, అవసరం లేకున్నా పదేపదే టెంపర్ అనే ముల్లుని ముట్టుకుంటారు. బాధతో విలవిల్లాడుతూ ఏడుస్తారు. 'ఇంకా నీ వల్లే' అంటూ నిందలేసుకుంటూ నిద్రకూ దూరమవుతారు. 

►ALSO READ | రేపే (ఆగస్టు 03) ఫ్రెండ్షిప్ డే.. చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి.. రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలి !

టెంపర్ అన్నది పార్ట్​నర్స్ ఇద్దరిలో ఉండొచ్చు. ఒక్కరిలోనూ ఉండొచ్చు. ఇద్దరిలోనూ టెంపర్ ఉంటే.. ఎవరూ తగ్గదు. కాబట్టి ఆ సంసారంలో సంతోషం ఆవిరైతుంది. ఇక పార్ట్ నర్స్ ఒక్కరిలో బ్యాడ్ టెంపర్ ఉంటే  కొన్నాళ్ల తర్వాత కూల్ పార్ట్ నర్ కూడా బ్యాలెన్స్ కోల్పోతారు. బ్యాడ్ టెంపర్ మీ బంధం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామంది.. దీన్ని రియలైజ్ కారు. ఏ బంధమైనా బీటలువారణానికి కోపమే బేసిక్ రీజన్ !

ఎందుకొస్తుంది ?

రిలేషన్స్ అన్నది ఒక గేమ్. ఒకరిమీద మరొకరు స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకరిమీద మరొకరు పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. 'మాది డబ్బు ఉన్న కుటుంబం.. "మేమింత చీఫ్​కాదు' లాంటి మాటలతో సోషల్ ఫైనాన్షియల్ ఆధిక్యత ప్రదర్శిస్తారు. ఇలాంటి ప్రవర్తన రిలేషన్ షిప్ మీద విరక్తి పుట్టిస్తుంది. అప్పుడు కోపం పుడుతుంది. అనుకున్నది జరగనప్పుడు, అసుకోనిది జరిగినప్పుడు పార్టనర్స్ లో  ఎవరికో ఒకరికి టెంపర్ లేస్తుంది. ఒక్కోసారి ఎవరి మీద కోపాన్నో పార్ట్​నర్ మీద చూపిస్తారు. బంతిని గోడకు ఎంత గట్టిగా విసిరికొడితే అంతే వేగంగా తిరిగొస్తుంది. కోపము కూడా అంతే.. పదేపదే కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు కూల్ గా ఉండే పార్ట్​నర్ కూడా కొన్నాళ్లకు బ్రేకప్ వరకు వెళతారు

యాంగర్ మేనేజ్ మెంట్

కోపాన్ని అణచివేయడమే 'యాంగర్ మేనేజ్ మెంట్ అని అనుకుంటారు చాలామంది. అయితే, నాకు అసలు కోవమే రావొద్దు అనేది హెల్దీగోల్ కాదు. దాన్ని ఎంతగా తొక్కి పెట్టినా అది పైకి లేస్తుంది. కోపం అనే ఒక సహజమైన ఎమోషన్ వెనకున్న మెసేజీని అర్ధం చేసుకొని, దాన్ని కంట్రోల్ తప్పకుండా హెల్దీగా ఎక్స్​ప్రెస్ చేయడమే యాంగర్ మేనేజ్​ మెంట్.   అంటే కోపాన్ని ఫీల్ కావాలి కానీ, బయటకు ప్రదర్శించద్దు. 

ఆ కోపాన్ని మాటల రూపంలోకి మార్చి చెప్పగలగాలి.  అప్పుడే జీవితంలో వచ్చే రకరకాల కల్లోలాల్ని తప్పించుకోగలుగుతారు. ప్రాక్టీస్ అనే యాంగర్ మేనేజ్ మెంట్ సాధ్యం అవుతుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకోగలినవాళ్లే.. బంధాన్ని మెరుగ్గా, అందంగా నిర్మించుకుంటారు. వేగంగా గోల్ఫ్ ని అందుకుంటారు. సంతృప్తికరమైన, ఆరోగ్యకరమైన జీవితం సొంతం చేసుకుంటారు.

కోపం ఉంటే నేరుగా..

కోపం ఉంటే ఏ విషయంలోనైనా ఓవర్ అనలైజింగ్' చేస్తారు. 'నువ్వు నన్ను ఎప్పుడూ డిస్టబ్ చేస్తావ్. నా అవసరాలను ఎప్పుడూ లెక్కలోకి తీసుకోవు. అందరునన్నే తిడతారు. నాకు అర్హత ఉన్నా క్రెడిట్ దక్కదు.  ఇలాంటి మాటలన్నీ అంటే కోపం గిల్లితే వచ్చేవే! ఇవన్సీ ఓవర్ జనలైజింగ్ కేటగిరి కిందే ఉంటాయి.

►ALSO READ | రేపే (ఆగస్టు 03) ఫ్రెండ్షిప్ డే.. చరిత్ర, ప్రాముఖ్యత ఏంటి.. రేపు ఎలా ప్లాన్ చేసుకోవాలి !

 కోపంలో ఉన్నప్పుడు కచ్చితంగా 'తప్పకుండా' అనే పదాలతో ఏమాట మాట్లాడినా కష్టం గా ఫీలవుతారు.లోపల నిద్రపోతున్న కోపం వల్లే మన గురించి ఎదుటి వాళ్లు ఏం  అనుకుంటున్నారో.. ఒక్కటే అలోచిస్తారు. వాళ్లను వాళ్లే అగౌరవ పరుచుకుంటారు. ఇది యాంగ్జైటీకి దారి తీస్తుంది.జరిగిపోయిన విషయాలను భూతద్దం లో చూడటం అనుకున్న దానికి విపరీతంగా జరిగితే, దానికి బాధ్యత వహించాల్సింది పోయి... దానికి అవతలి వాళ్లను బ్లేమ్ చేయడం.. ఇవన్నీ కోపం వల్లే జరుగుతాయి

నమ్మకం పోతుంది

బంధం అన్నాక ముద్దు ముచ్చటతో పాటు కోపతాపాలు ఉంటాయని కొంతమంది పార్టనర్స్ కవర్ చేస్తుంటారు. వాళ్ల కోపాన్ని మాటల్లో  చెప్పకుండా... చేతల్లో చూపించడం కచ్చితంగా ప్రేమలో భాగం కాదు. ఊరితే కోపం వస్తుంటే.. అది గొడవలకు కారణమవుతుంటే.. పార్ట్​నర్స్ లో 'మళ్లీ కలుస్తాం' అనే నమ్మకం నెమ్మదిగా పలుచబడుతుంది. ఎందుకంటే  ఆ టైంలో అన్న మాటలు మనసుకు గాయం చేస్తాయి. తర్వాత ఈ విషయం మీద కలిసి కూర్చొని మాట్లాడలేకపోతారు. ఈ పోట్లాట అగాలంటే కలిసి చర్పించుకోవాలి.  బ్యాడ్ టెంపర్ ఉంటే ఏ విషయం చర్చించాలన్నా కష్టమే. అప్పుడు మళ్లీ కలవడానికి చాలా కష్టపడతారు.

ఒక లిమిట్ ఉంటుంది

ఎవరి మీదైనా అసహనం ప్రదర్శించడానికి ఒక లిమిట్ ఉంటుంది. కానీ.. ఆ లిమిట్ దాటి అసహనం ప్రదర్శిస్తే.. ఒక రోజు అది పరీక్షకు గురవుతుంది. అప్పుడు వాళ్లు మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధం కావొచ్చు. చాలా మంది తమ పార్ట్​నర్ సరిగ్గా ట్రీట్ చేయలేదనే అనుకుంటారు. కానీ, బయటకు చెప్పరు ఎప్పుడైతే మూత తీసి మీ పార్ట్​నర్  పై కోపం కక్కుతారో అప్పుడు తెలుస్తుంది.. పొంగే కోపం వల్ల తెలియకుండానే మీరు మీ పార్ట్​నర్ కి దూరం అవుతుంటారు. 

సంతోషం లేని చోట నుంచి దూరంగా వెళ్లిపోవడం మనిషి లక్షణం. అలా కోపంతో పార్టనర్ మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోవడం, బయటకు రమ్మన్నా రాకపోవడం, ఫోన్ కాల్స్​ ను  తగ్గించడం ఇలా అన్ని విధాలుగా దూరం పెట్టడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుంది.