TFDC చైర్మన్ గా అనిల్ కూర్మాచలం బాధ్యతలు

TFDC చైర్మన్ గా అనిల్ కూర్మాచలం బాధ్యతలు

టీఆర్ఎస్ ఎన్నారై అనిల్ కుమార్ కూర్మాచలం ఇటీవలే నూతనంగా తెలంగాణ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైయ్యారు. ఈ మేరకు ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. మంత్రి సమక్షంలో అనిల్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తలసాని. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరలు హాజరైయ్యారు.