27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో ‘ఝాన్సీ’

 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో ‘ఝాన్సీ’

‘ఇప్పుడున్న ఈ మంచి జీవితం కలలా మిగిలిపోకూడదన్నా, నా గతం వల్ల నా వాళ్లకు ఏం జరగకుండా ఉండాలన్నా నేను ఆగిపోకూడదు’ అంటోంది అంజలి. బలమైన పాత్రలతో వెండితెరపై ఆకట్టుకుంటున్న అంజలి.. ఇప్పుడు వెబ్ సిరీసులతోనూ ఇంప్రెస్ చేయడానికి రెడీ అవుతోంది. ఆమె లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటించిన ‘ఝాన్సీ’.. ఈ నెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌‌‌‌‌లో స్ట్రీమ్ కానుంది. నిన్న ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.

‘ఒక మనిషి  జీవితంలో అన్నిటికంటే పెద్ద శిక్ష.. తనెవరో తనకు తెలియకపోవడం’ అనే డైలాగ్‌‌‌‌తో ఆమె గతం మర్చిపోతుందనే విషయాన్ని చెప్పారు.  అయితే ఎవరెవరో వెంటాడుతూ ఉంటారు. తనకీ వాళ్లకీ సంబంధమేంటో, శత్రుత్వమేంటో ఆమెకి అర్థం కాదు. అయినా ధైర్యంగా ఎదుర్కోడానికి సిద్ధపడుతుంది. ‘నా ఫ్రెండ్స్ ఎవరో నాకు తెలియకపోయినా ఫర్వాలేదు.  కానీ నా శత్రువులెవరో నాకు తెలియాలి’ అంటోంది. అసలేం జరిగింది, ఆమె గతం ఎందుకు మర్చిపోయింది, ఎవరితో తనకి థ్రెట్ ఉంది అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. చాందినీ చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ, ముమైత్ ఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తిరు దర్శకత్వంలో  కృష్ణ నిర్మించారు.