
న్యూఢిల్లీ: జెన్సోల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అన్మోల్ సింగ్ జగ్గీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన సోదరుడు పునీత్ సింగ్ జగ్గీ కూడా కంపెనీ పూర్తికాల డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. సెబీ మధ్యంతర ఉత్తర్వుల మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు అన్మోల్ సింగ్ జగ్గీ పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం, పాలనాపరమైన సమస్యల కారణంగా అన్మోల్ సింగ్ జగ్గీ, పునీత్ సింగ్ జగ్గీలను సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి నిషేధిస్తూ సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జెన్సోల్ దాఖలు చేసిన అప్పీల్‌ను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్మోల్ సింగ్ జగ్గీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పునీత్ సింగ్ జగ్గీ పూర్తికాల డైరెక్టర్‌గా తమ పదవులకు రాజీనామా చేశారు. కంపెనీలోని వివిధ కమిటీల నుంచి కూడా వైదొలుగుతారు.