ఏపీలో మూతబడ్డ అన్నక్యాంటీన్లు…

ఏపీలో మూతబడ్డ అన్నక్యాంటీన్లు…

ఏపీలో అన్న క్యాంటీన్లకు ఆదీలోనే ఎదురు దెబ్బ తగిలింది.  కర్నూలు జిల్లా ఆదోనిలో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. రెండు రోజులుగా అన్న క్యాంటీన్లు తెరవడం లేదు. గతంలో టీడీపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ గడువు ముగియడంతోనే నిలిపి వేసినట్లు చెబుతున్నారు. రూ.5లకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూతపడటంతో పేదలు నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. ప్రభుత్వం స్పందించి అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.