ముంబై: లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో మహారాష్ట్ర సర్కార్ విఫలమైందని సామాజిక కార్యకర్త అన్నా హజారే మండిపడ్డా రు. ఈ చట్టం అమలుకోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఆయన శుక్రవారం ప్రకటించారు. తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో జనవరి 30 నుంచి దీక్ష చేపడతానని వెల్లడించారు. ఇక ఇదే తన చివరి నిరసన అవుతుందేమోనని వ్యాఖ్యా నించారు.
మహారాష్ట్రలో లోకాయుక్త చట్టం తీసుకురావాలని 2022లో అన్నా హజారే నిరాహార దీక్ష చేపట్టా రు. నాటి సీఎం ఫడ్నవీస్ హామీతో దీక్ష విరమించారు. కానీ ఇప్పటి వరకు చట్టం అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో లోకాయుక్త చట్టం అమల్లో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంపై అన్నా హజారే మండిపడ్డారు.

