న్యూఢిల్లీ,వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు పెంచింది. ఇండియా ఎ హెడ్ కమర్షియల్ వింగ్ చీఫ్ అరవింద్ కుమార్ సింగ్ ను సీబీఐ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. సౌత్ గ్రూప్ నుంచి డబ్బుల మళ్లింపులో కీలకపాత్ర పోషించినట్లు సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ప్రధానంగా గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరపున ప్రచారం నిర్వహించిన చారియట్ మీడియాకు సౌత్ గ్రూప్ ద్వారా రూ.17 కోట్లను ఆయన హవాలా రూపంలో మళ్లించారని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. డబ్బుల మళ్లింపుకు సంబంధించి ఇటీవల సీబీఐ వాట్సాప్ చాట్స్, ఇతర ఆధారాలను సేకరించినట్లు తెలిసింది. కాగా, అరవింద్ కుమార్ సింగ్ ను సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూలోని స్పెషల్ కోర్టులో మంగళవారం హాజరుపరుచనున్నట్లు తెలిసింది..