
హైదరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో దళారుల దందా బయటపడుతున్నది. ఏఈ, ఏఈఈ పేపర్లు కొనుగోలు చేసి పరీక్షలు రాసిన మరో నలుగురిని మంగళవారం సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ నుంచి వరంగల్‌కు చెందిన మనోజ్ కుమార్ రెడ్డి, హైదరాబాద్‌కు చెందిన మురళీధర్ రెడ్డి అనే దళారులు క్వశ్చన్ పేపర్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
వారిని సోమవారం అధికారులు అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలను మరో ఏడుగురు కొనుగోలు చేశారని వారు తెలిపినట్లు సమాచారం. వీరి వద్ద నుంచి పేపర్ కొనుగోలు చేసిన నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆది సాయిబాబు, ముడావత్ శివకుమార్, నాగార్జున సాగర్‌కు చెందిన రమావత్ మహేశ్, ఖమ్మంకు చెందిన పొన్నం వరుణ్‌ను అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.