కెనడాలో మరో దేవాలయం ధ్వంసం.. గోడలు, గేటుకు ఖలిస్థానీ పోస్టర్లు

కెనడాలో మరో  దేవాలయం ధ్వంసం.. గోడలు, గేటుకు ఖలిస్థానీ పోస్టర్లు

న్యూఢిల్లీ: కెనడాలో తాజాగా మరో హిందూ దేవాలయాన్ని ఖలిస్థానీలు ధ్వంసం చేశారు. బ్రిటిష్‌‌‌‌ కొలంబియాలోని సర్రేలో ఉన్న పురాతన లక్ష్మీ నారాయణ ఆలయంలో శనివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు ఖలిస్థానీ పోస్టర్లను అతికించారు. వీటిపై ‘జూన్‌‌‌‌ 18న జరిగిన హత్యపై ఇండియా పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తుంది’అని రాసి ఉంది. ఈ పోస్టర్లలో హర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ నిజ్జర్‌‌‌‌‌‌‌‌ ఫొటో కూడా ఉంది. 

ముసుగు వేసుకొచ్చిన ఇద్దరు ఖలిస్థానీ మద్దతుదారులు ఈ పోస్టర్లను టెంపుల్‌‌‌‌ గోడలపై, ప్రధాన గేటుపై అంటించారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. హర్దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌ నిజ్జర్‌‌‌‌‌‌‌‌ కెనడాలో సర్రేలోని గురునానక్‌‌‌‌ సిక్కు గురుద్వారా సాహిబ్‌‌‌‌ అధిపతిగా ఉండేవారు. అలాగే, ఖలిస్థాన్‌‌‌‌ టైగర్‌‌‌‌‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (కేటీఎఫ్‌‌‌‌) చీఫ్‌‌‌‌గా నిజ్జర్‌‌‌‌‌‌‌‌ పనిచేశారు. జూన్‌‌‌‌ 18న గురుద్వారా ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను చంపేశారు.