మరో కొత్త వైరస్​.. నియోకొవ్​

V6 Velugu Posted on Jan 29, 2022

  • సౌత్​ ఆఫ్రికా గబ్బిలాల్లో గుర్తించిన వూహాన్​ ఇనిస్టిట్యూట్​ సైంటిస్టులు
  • మెర్స్​లో ఇదో రకమని వెల్లడి
  • సోకితే ముగ్గురిలో ఒకరు చనిపోతారని హెచ్చరిక

వూహాన్​: కరోనా ప్రపంచాన్ని చుట్టేసి రెండేండ్లాయే.. ఆ రెండేండ్లలో ఎన్నో వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ‘డెల్టా’తో ప్రపంచమంతా అల్లాడిపోయింది. దాని బెడద పోయిందనుకుంటుండగానే.. ఒమిక్రాన్​ వచ్చి పడింది. యమా స్పీడుగా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. అయితే, ఇప్పుడు మరో కొత్త కరోనా వైరస్​ ‘నియోకొవ్​’ పుట్టుకొచ్చేసింది. అయితే, ఇది ‘డెల్టా’, ‘ఒమిక్రాన్​’లాగా కరోనా వేరియంట్​ కాదు. కరోనా వైరస్​లలోనే ఓ జాతి. దీనిని ప్రస్తుత కరోనా పుట్టిన చైనా సైంటిస్టులే గుర్తించారు. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ఆ వైరస్​ ఆనవాళ్లున్నాయని వూహాన్​ యూనివర్సిటీ, చైనీస్​ అకాడమీ ఆఫ్​ సైన్సెస్​కు చెందిన ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ బయోఫిజిక్స్​ సైంటిస్టులు చెప్తున్నారు. 2012, 2015లో మిడిల్​ ఈస్ట్​ దేశాలపై పంజా విసిరిన ‘మిడిల్​ ఈస్ట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​ (మెర్స్​)’లోనే కొత్త స్ట్రెయిన్​ అని అంటున్నారు. ఈ ‘మెర్స్​– నియోకొవ్’ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మనుషులకు సోకిందా?
గబ్బిలాల్లో గుర్తించిన ఈ స్ట్రెయిన్​ ఇంకా మనుషుల దాకా రాలేదని, దీని జీన్స్​లో మరొక్క మ్యుటేషన్​ జరిగితే మనుషులకు సోకే ముప్పు ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. పీడీఎఫ్​2180 కొవ్​ అనే రకం కూడా మనుషులదాకా చేరే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్​తో పోలిస్తే నియోకొవ్​.. యాంజియో టెన్సిన్​ కన్వర్టింగ్​ ఎంజైమ్(ఏసీఈ)–2 రిసెప్టార్లతో బాండింగ్​ చేసుకునే విధానం కొత్తగా ఉందని, కాబట్టి కరోనా కన్నా దాని తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొవిడ్​ వ్యాక్సిన్లు. నియోకొవ్​పై పనిచేయవని, యాంటీ బాడీలున్నా వైరస్​ సోకకుండా అడ్డుకోలేవని చెప్తున్నారు. అయితే, ఈ వైరస్​కు సంబంధించి డబ్ల్యూహెచ్​వో ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Tagged warning, new virus, Neokov

Latest Videos

Subscribe Now

More News