ఒడిశాలో మరో రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన గూడ్స్

ఒడిశాలో మరో రైలు ప్రమాదం : పట్టాలు తప్పిన గూడ్స్

ఒడిశా రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరిగింది. కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ యాక్సిడెంట్ జరిగిన 51 గంటల తర్వాత.. అదే రాష్ట్రంలో మరో రైలు ప్రమాదం జరగడం  కలకలం రేపుతోంది. ఒడిశా రాష్ట్రం బార్ ఘర్  ప్రాంతంలో.. సున్నపురాయితో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 

2023, జూన్ 5వ తేదీ సోమవారం ఉదయం.. డుంగూరి నుంచి బార్ ఘర్ వెళుతున్న గూడ్స్ రైలు.. బార్ ఘర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఐదు బోగీలు పక్కకు పడిపోయాయని.. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ యాక్సిడెంట్ లో రైలు డ్రైవర్లు, గార్డు సురక్షితంగా ఉన్నారు. పట్టాలు తప్పిన ప్రాంతానికి రైల్వే అధికారులు, పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైలుకు మరమ్మత్తులు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.