బరువు తగ్గేందుకు మరో మార్గం

బరువు తగ్గేందుకు మరో మార్గం

అధిక బరువు ఉన్న వాళ్లు బరువు తగ్గేందుకుచాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దీని కోసంఎక్కువ మంది డైటింగ్ ఫాలో అవుతుంటారు. ఇది కొంచెం కష్టమైన విషయం. కానీ, ఒకచిన్న టెక్నిక్ తో బరువు తగ్గొచ్చంటున్నారు పరిశోధకులు. అదే తినే ప్లేటు సైజు తగ్గించుకోవడం. ఇలా చేయడం వల్ల పొట్ట భాగంలో పేరుకుపోయిన అధిక కొవ్వు తగ్గుముఖం పడుతుంది. పొట్ట భాగంలోకొవ్వు  పేరుకు పోవడం వల్ల డయాబెటిస్,కేన్సర్ వంటి జబ్బులొచ్చే అవకాశాలుఎక్కువ. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎక్కువ పరిమాణం ఉన్నప్లేటుతో  పోలిస్తే తక్కువ పరిమాణం ఉన్నపళ్లెం లోనే భోజనం చేయాలి. పదకొండు అంగుళాల పరిమాణం  ఉన్న ప్లేట్‌ తో పోలిస్తే..పది అంగుళాల  ప్లేట్‌లో తక్కువ  ఆహారం తీసుకుం టారని కార్నెల్ యూనివర్సిటీపరిశోధనలో  వెల్లడైంది. అందువల్ల పొట్టపెరిగిపోయిన  వాళ్లు చిన్న ప్లేట్లలో ఆహారం తీసుకుంటే పొట్ట సైజు తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆహారం తీసుకునేటప్పుడు కడుపు నిండినట్లు అనిపించడానికి ఇరవై నిమిషాల సమయంపడుతుంది. పెద్ద ప్లేట్‌లో నిండుగా ఆహారంపెట్టుకొని తినడం వల్ల మనకు తెలియకుండానే ఎక్కువ తింటాం. చిన్నప్లేట్‌లో ఆహారంతీసుకోవడంతోపాటు.. ఆరోగ్యకరమైన,సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందొచ్చు . బరువు తగ్గాలని అనుకునేవారు ముఖ్యంగా జంక్ ఫుడ్ ను పక్కనబెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు.