వర్షాకాలం బయటకు వెళ్లడం కాస్త ఇబ్బందే. కానీ కొన్ని ప్రకృతి అందాలను చూడాలంటే వర్షాకాలమే సరైన టైం. మరీ ముఖ్యంగా జలపాతాలను. వర్షాలు కురిసేటప్పుడు జలపాతాలు మరింత అందంగా ముస్తాబవుతాయి. అలాంటి అందమైన జలపాతం ఒకటి హైదరాబాద్ సిటీకి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ‘అంతరగంగ’ దాని పేరు.
సిటీలో ఉండేవాళ్లు అడవులు, వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ లాంటివి ఎక్స్‌ప్లోర్ చేయాలంటే..ఆదిలాబాద్ లేదా బెంగళూరు లాంటి ప్లేసులకు వెళ్లాలి. కానీ హైదరాబాద్‌కు దగ్గర్లో ఒక హిడెన్ వాటర్ ఫాల్ ఉన్న సంగతి తెలుసా? వీకెండ్ గెటవేకు ఇది పర్ఫెక్ట్ స్పాట్. కాస్త లాంగ్ డ్రైవ్, కొద్దిపాటి ట్రెక్కింగ్‌తో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకెళ్లొచ్చు.
ఇలా చేరుకోవాలి
హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై రామోజీ ఫిల్మ్ సిటీ, అబ్దుల్లాపూర్‌మెట్ దాటాక కొంతదూరం జర్నీ చేయాలి. ఆ తరువాత లెఫ్ట్ తీసుకుంటే రంగారెడ్డి జిల్లా కవాడి పల్లి గ్రామం వస్తుంది. ఇక్కడి అటవీ ప్రాంతంలోనే అంతరగంగ జలపాతం ఉంది. వీకెండ్స్‌లో ఇక్కడికి చాలామంది వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జలపాతం దగ్గర మరింత సందడి ఉంటుంది. అయితే దీన్ని చేరుకోవడానికి కొంచెం ట్రెక్కింగ్ చేయాలి. ఒక చిన్న వీకెండ్ ట్రిప్‌కు ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్.
