
పబ్లిక్ ప్లేసుల్లో, జర్నీల్లో మాస్క్ పెట్టుకోమని ప్రభుత్వాలు ఎంతగా మొత్తుకుంటున్నా పట్టించుకోని వాళ్లు బోలెడుమంది. మాస్క్ పెట్టుకోని వాళ్లవల్ల ఇతరులకు ప్రమాదం. వాళ్లకూ ముప్పే. కరోనా కేసులు ఇంతగా పెరుగుతున్నా అజాగ్రత్తతో ఉండేవాళ్లు ఇంకా ఉన్నారు. ఇలాంటి వాళ్ల విషయంలో కఠినంగా ఉండాల్సిందే. ఈమధ్య ఒక విదేశీ విమానం లో మాస్క్ పెట్టుకోని జంటకు ఎదురైన అనుభవం, మాస్క్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవాళ్లందరికీ ఒక కనువిప్పు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక విదేశీ విమానంలో ఒక జంట మాస్క్ పెట్టుకోలేదు. తోటి ప్యాసింజర్స్, ఫ్లైట్ అటెండెంట్ ఎంత చెప్పినా వినలేదు. పైగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో మాస్క్ పెట్టుకోకపోతే, విమానం నుంచి దింపాల్సి వస్తుందని చెప్పారు. అయినా వినిపించుకోకపోవడంతో, ఇద్దరినీ విమానం నుంచి దింపేశారు. వాళ్లు అలా వెళ్లడంతోనే విమానంలోని స్టాఫ్, ప్యాసింజర్స్ క్లాప్స్ కొట్టారు. మాస్క్ పెట్టుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవాళ్లకు, తోటి ప్రయాణికుల్ని రిస్క్‌లో పెట్టేవాళ్లకు ఈ ఇన్సిడెంట్ ఒక కనువిప్పు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికెళ్లినా మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి. పైగా విమానయాన కంపెనీలు ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాయి. ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే, అవసరమైతే విమానంలోంచి దించేస్తామని కూడా చెప్తున్నాయి. విమానంలోనే కాదు.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో జర్నీ చేసే ప్రతివాళ్లు కచ్చితంగా మాస్క్ పెట్టుకుంటే మంచిది.