అజారుద్దీన్కు ముందస్తు బెయిల్

అజారుద్దీన్కు ముందస్తు బెయిల్

హెచ్ సీఏ( HCA) మాజీ  అధ్యక్షులు అజారుద్దీన్ కు మల్కాజిగిరి కోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ పీఎస్ లిమిట్ లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చింది ధర్మాసనం. హెచ్సీఏ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు దోచుకున్నారంటూ సుప్రీం కోర్టు నియమించిన లావు నాగేశ్వరావు కమిటీ ఫిర్యాదు చేసింది.

 దీనిపై కోర్టుకు వెళ్లిన అజారుద్దీన్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని  పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసి.. 41సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి విచారించాలని ఆదేశింది. అజారుద్దీన్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఇప్పటికే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ లో ప్రచారం మొదలు పెట్టారు.  కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తున్నారు. తనను గెలిపించాలని కోరుతున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్,ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంది.