త్వరలోనే భారత్ కు చోక్సీ : అంటిగ్వా ప్రధాని

త్వరలోనే భారత్ కు చోక్సీ : అంటిగ్వా ప్రధాని

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోడీ రూ. 13 వేల కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో మెహుల్ చోక్సీని భారత్ కు అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని అంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌనే తెలిపారు. చోక్సీతో తమ దేశానికి ఎటువంటి విలువ ఉండదని, అతని అప్పీళ్లు ముగిసిన తర్వాత ఇండియాకు అప్పగిస్తామని చెప్పారు.

భారత అధికారులు ఎప్పుడైనా చోక్సీని విచారించవచ్చని గాస్టన్ స్పష్టం చేశారు. PNB స్కాంలో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీకి చోక్సీ బంధువు. కేసు నమోదైన తర్వాత అంటిగ్వాకు వెళ్లిపోయిన చోక్సీని రప్పించేందుకు కొన్ని రోజులుగా భారత అధికారులు ప్రయత్నిస్తున్నారు.