
తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ గవర్నర్ తమిళి సై. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన తమిళి సై పార్టీ ఆఫీసులో బీజేపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. అధిష్టానం ఎక్కడి నుంచి ప్రచారం చేయమంటే.. అక్కడి నుంచి చేస్తానని చెప్పారు. రిజర్వేషన్లు తీసే ప్రసక్తే లేదని.. దీనిపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ఏప్రిల్ 29న ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆమెకు బీజేపీ నేతలు రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం పలికారు. ఆమెతో పాటు తమిళనాడుకు చెందిన పలువురు బీజేపీ నేతలు వచ్చారు. తెలంగాణలో 10 రోజుల పాటు బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు తమిళి సై.
తెలంగాణ గవర్నర్ కు రాజీనామా చేసిన తమిళి సై తమిళనాడులోని చెన్నై (దక్షిణ) లోక్‌సభ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా తమిళిసై పోటీ చేశారు. దీనికి మొదటి దశలోనే పోలింగ్ జరిగింది. దీంతో తెలంగాణలో బీజేపీ తరపున ప్రచారం చేయడానికి వచ్చారు.
The warm welcome by BJP karyakarthas at Hyderabad Railway Station. Their energy and dedication are truly inspiring.#BJP #Hyderabad pic.twitter.com/ixpJSiZkMZ
— Dr Tamilisai Soundararajan (மோடியின் குடும்பம் ) (@DrTamilisai4BJP) April 29, 2024