చెవిలో వ్యాక్స్ నిండిపోతే.. చాలా సమస్యలు వస్తుంటాయి. అందుకే అప్పుడప్పుడు జాగ్రత్తగా వ్యాక్స్‌ని క్లీన్ చేసుకోవాలి. అందుకోసం ఈ గాడ్జెట్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అన్విష్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ గాడ్జెట్‌ని వైఫై ద్వారా ఆండ్రాయిడ్/ఐవోఎస్ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టూల్‌కి ప్రత్యేకంగా కెమెరా కూడా ఉంటుంది. దాంతో క్లీన్ చేసేటప్పుడు చెవి లోపలి భాగాన్ని ఫోన్ డిస్‌ప్లేలో చూడొచ్చు. చెవి లోపల వ్యాక్స్ ఎక్కడుంది? ఎంత ఉంది? అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
కెమెరాలో వైడ్ యాంగిల్ వ్యూ కూడా ఉంటుంది. హెచ్‌డీ వీడియో రికార్డ్ చేస్తుంది. అంతేకాదు.. ఇందులో 6 హై బ్రైట్‌నెస్ ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయి. వాటివల్ల ఇయర్ కెనాల్‌లోని ప్రతి మూల కనిపిస్తుంది. దీనికి ఉండే 360 డిగ్రీ స్పైరల్ డిజైన్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఇయర్‌పిక్ ఇయర్‌వాక్స్‌ను సమర్థవంతంగా తొలగిస్తుంది. పెట్స్‌కి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. లిథియం–అయాన్ బ్యాటరీతో వస్తుంది. యూఎస్‌బీ కేబుల్‌తో చార్జ్ చేసుకోవచ్చు.
ధర: రూ. 599
