అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ఇండియా ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ల (ఏఎంసీఏ)ల తయారీకి ఈ రాష్ట్ర కేబినెట్ 600 ఎకరాలను డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓకి కేటాయించిందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దీని ప్రకారం, ఈ ప్లాంట్‌లో మొత్తం 140 ఏఎంసీఏలు తయారు చేయనున్నారు.
ప్రాజెక్ట్ విలువ రూ.లక్ష కోట్లు. ఏఎంసీఏ తయారీకి షార్ట్‌లిస్ట్ అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ ఈ ప్లాంట్‌ను నిర్మించనున్నాయి. డిజైన్, టెస్టింగ్, మాడ్యూల్ అసెంబ్లింగ్ వంటివి బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) వద్ద జరుగుతాయి.
ఆ మాడ్యూల్స్‌ను బెంగళూరుకు 50 కి.మీల దూరంలో ఉన్న పుట్టపర్తికి తరలించి, ఫైనల్ అసెంబ్లీ, గ్రౌండ్ టెస్టింగ్ చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమిని ఇచ్చి, ఫ్లైట్ టెస్టింగ్ రేంజ్, సైంటిస్టుల టౌన్‌షిప్, ప్రొడక్షన్ ఫెసిలిటీ ఏర్పాటుకు అనుమతిచ్చింది.
