
టీడీపీ నేత నారా లోకేష్ కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ కింద నారా లోకేష్ కు సీఐడీ అధికారులు నోటీసులిచ్చారు. ఢిల్లీలోని ఎంపీ గల్లాజయదేవ్ ఇంట్లో ఉన్న ఆయనకు నోటీసులు ఇచ్చారు. నారా లోకేష్ నోటీసులు తీసుకున్నారని చెప్పారు. అక్టోబర్ 4న ఉదయం 10 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు రావాలని చెప్పారు.
Also Read :- చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెండ్
ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల కేసులో ఏ14 గా ఉన్న లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా కోర్టు కొట్టేసింది. అయితే లోకేష్ కు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని అక్టోబర్ 4 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొన్ని రోజులుగా లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారు.